శనివారం 16 జనవరి 2021
Crime - Jan 01, 2021 , 15:36:49

8 వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

8 వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

లక్నో: దట్టమైన పొగ మంచు వల్ల ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు జరిగాయి. దట్టమైన పొగ మంచు వల్ల ముందు ఉన్నవి, ఎదురుగా వచ్చేవి సరిగా కనిపించకపోవడంతో ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదాలు జరిగిన ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిని సైఫాయిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కాగా కొత్త సంవత్సరం ఆరంభం రోజున రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. మరోవైపు శీతాకాలంలో పొగ మంచు వల్ల రోడ్లపై వచ్చే పోయే వాహనాలు సరిగా కనిపించవని, ఈ నేపథ్యంలో తెల్లవారుజామున వాహనాలు నడపవద్దని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల సూచనలు జారీ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి