మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 15, 2021 , 09:45:39

క‌ర్ణాట‌క‌లో ఘోర ప్ర‌మాదం : 11 మంది మృతి

క‌ర్ణాట‌క‌లో ఘోర ప్ర‌మాదం : 11 మంది మృతి

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ జిల్లాలో గురువారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఇట్టిగ‌ట్టి వ‌ద్ద ట్రావెల్స్ వ్యాన్‌ను వెనుక నుంచి వ‌చ్చిన టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

VIDEOS

logo