శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 27, 2021 , 08:14:01

ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి

ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌ సమీపంలోని జీపును ఓ ట్రక్కు ఢీకొన్నది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం.. రాజస్థాన్‌లోని ప్రముఖ ఆలయం ఖాటూశ్యామ్‌ జీ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరుగివెళ్తున్నారు. ఈ క్రమంలో జైపూర్‌ సమీపంలోని టోంక్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న జీపును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది మృతిచెందారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

VIDEOS

logo