బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 19:21:20

కారు.. బైకులు ఢీకొని 8 మంది దుర్మరణం

కారు.. బైకులు ఢీకొని 8 మంది దుర్మరణం

ఛతర్‌పూర్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. మూడు బైకులు ఢీకొని ఎనిమిది మంది మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. బమితా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనగర్‌ పన్నా రోడ్డులో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఈ విషాదం నుంచి కోలుకునే శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సైతం మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఘటన ఎలా జరిగిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
 


logo