బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 13, 2020 , 22:04:02

8 కిలోల గంజాయి పట్టివేత

8 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్ రూరల్ :  ఆంధ్రా నుంచి గుట్టచుప్పుడు కాకుండా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఎన్నికల గ్రామానికి చెందిన ముద్దు సతీశ్‌ అక్రమంగా గంజాయి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సాయంతో సతీష్ ఇంటిపై దాడి చేసి 8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు సతీశ్‌ను విచారించగా విశాఖపట్నం జిల్లా తాడేరుకు చెందిన శేఖర్ వద్ద గంజాయి కొని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. దీంతో శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు విశాఖపట్నం నుంచి ఏడెనిమిదేళ్లుగా తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎండు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo