శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 14:52:15

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పేకాడుతున్న 8 మంది అరెస్ట్‌..

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పేకాడుతున్న 8 మంది అరెస్ట్‌..

హైదరాబాద్‌ : మాజీ మంత్రి ముకేష్‌గౌడ్‌కు కేటాయించిన 129వ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి పేకాడుతున్న 8 మందిని సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు..  హైదరాబాద్‌లోని ఆదర్శ నగర్‌లో గల న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ మంత్రి ముకేశ్‌గౌడ్‌కు చెందిన క్వార్టర్స్‌లో రిటైర్ట్‌ ఉద్యోగులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు  పేకాడుతున్నారనే సమాచారం మేరకు గురువారం రాత్రి సైఫాబాద్‌ పోలీసులు దాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 సెల్‌ఫోన్లు, రూ.1.12 లక్షల నగదు, 52 కార్డులు, 5 సీల్‌ చేసిన పేక డబ్బాలు, 3 సిగరెట్‌ పెట్టెలు, 2 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  శుక్రవారం ఉదయం వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో హిమాయత్‌నగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి కిరణ్‌కుమార్‌,  సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన సూపర్‌మార్కెట్‌ వ్యాపారి సతీశ్‌కుమార్‌, ఆదర్శ్‌నగర్‌కు చెందిన గోపాల్‌రావు, పద్మారావునగర్‌ కాలనీకి చెందిన ప్రదీప్‌, ఖైరతాబాద్‌కు చెందిన వ్యాపారి మురళి, హిమాయత్‌నగర్‌కు చెందిన రియల్టర్‌ మన్మోహన్‌, ట్రూప్‌ బజార్‌కు చెందిన జిమ్‌ ట్రైనర్‌ రాజ్‌కుమార్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


logo