మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 17:56:57

జీన్స్‌ ప్యాంటులో దాచిన బంగారం పట్టివేత

జీన్స్‌ ప్యాంటులో దాచిన బంగారం పట్టివేత

చెన్నై: జీన్స్‌ ప్యాంటులో దాచిన బంగారాన్ని పసిగట్టిన కస్టమ్స్‌ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్‌ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బంగారాన్ని పేస్టుగా చేసి సన్నని కవర్లలో ఉంచి జీన్స్‌  ప్యాంటులోని బెల్ట్‌ భాగం వద్ద దాచిన విషయాన్ని వారు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 731 గ్రాముల బంగారం ముద్ద విలువ రూ.34.5 లక్షలని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


logo