e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home క్రైమ్‌ న‌కిలీ రెమ్‌డెసివిర్ త‌యారు చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌

న‌కిలీ రెమ్‌డెసివిర్ త‌యారు చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌

న‌కిలీ రెమ్‌డెసివిర్ త‌యారు చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌

న్యూఢిల్లీ: న‌కిలీ రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు త‌యారు చేస్తున్న ఏడుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్త‌రాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో వీటిని త‌యారు చేస్తున్న‌ట్లు స‌మాచారం అందింది. దీంతో కోట్‌ద్వార్‌, హ‌రిద్వార్‌, రూర్కీలో పోలీసులు దాడుల చేశారు. కోట్‌ద్వార్‌లో న‌కిలీ ఉత్ప‌త్తి కేంద్రాన్ని గుర్తించారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న 196 న‌కిలీ రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు, 3 వేల ఖాళీ వైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్ప‌టికే 2 వేల న‌కిలీ ఇంజెక్షన్ల‌ను ఒక్కొక్క‌టి రూ.25,000కు అమ్మిన‌ట్లు తెలుసుకున్నారు. వీటిని కొనుగోలు చేసిన వారిని గుర్తించేందుకు పోలీస్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.

ప్ర‌ధాన సూత్ర‌ధారి ఆద‌త్య గౌత‌మ్‌ను రూర్కీలో, ఇత‌ర చోట్ల మ‌రో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. న‌కిలీ రెమ్‌డెసివిర్ త‌యారీ వెనుక ప‌లువురి ప్ర‌మేయం ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ శ్రీవాస్త‌వ ఈ న‌కిలీ రెమ్‌డెసివిర్ త‌యారీ కేంద్రం వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. న‌కిలీల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌కిలీ రెమ్‌డెసివిర్ త‌యారు చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement