హుక్కా బార్లలో 65 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు హుక్కా బార్లలో 65 మంది అరెస్ట్ అయ్యారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో రోహిణి ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా బార్స్‌పై పోలీసులు రైడ్ చేశారు. జనవరి 1న సెక్టార్ 9 ప్రాంతంలోని అప్‌టౌన్ కేఫ్‌లో సోదాలు చేశారు. నలుగురు సిబ్బందితోసహా 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. పది హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. జనవరి 2న సెక్టార్ 8లోని మడ్ హౌస్ రెస్టారెంట్‌పై రైడ్ చేశారు. ఆరుగురు సిబ్బందితో సహా 35 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో పది మంది మహిళలు, ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఇక్కడ 12 హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యజయానులను కూడా అరెస్ట్ చేశారు.
ఈ హుక్కా బార్లలో కరోనా నిబంధనలు పాటించకుండా హుక్కాలు పీల్చుతూ డ్యాన్సులు చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు. సంబంధిత ఓనర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు.