న్యూఢిల్లీ: ఆరేండ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రంజిత్ నగర్‌కు చెందిన ఆరేండ్ల బాలిక శుక్రవారం ఉదయం టిఫిన్ చేసేందుకు సమీప ప్రాంతానికి వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాగా రక్తస్రావం అవుతున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. మనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో నిందితుడు సీసీటీవీలో కనిపించాడు. అతడి వెనుక ఆ బాలిక వెళ్తున్నట్లు అందులో ఉన్నది. అయితే ఆ నిందితుడు ఎవరు అన్నది ఇంకా గుర్తించలేదు. కాగా, ఈ కేసు నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.