శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 28, 2020 , 16:10:42

ఏపీలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

ఏపీలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

ప‌శ్చిమ గోదావ‌రి : జిల్లాలోని వేలేరుపాడు మండ‌లం వ‌సంత‌వాడ‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌మాద‌వ‌శాత్తు వాగులో ప‌డి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో నుంచి విద్యార్థుల మృత‌దేహాల‌ను స్థానికులు బ‌య‌ట‌కు వెలికితీశారు. న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా వ‌సంత‌వాడ‌కు చెందిన కొన్ని కుటుంబాలు వాగు స‌మీపంలో వ‌న‌భోజ‌నాల‌కు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల‌ను గొట్టిప‌ర్తి మ‌నోజ్‌(15), గంగాధ‌ర వెంకట్రావు(15), కెల్లా ప‌వ‌న్‌(17), క‌ర్నాటి రంజిత్‌(16), కూనార‌పు రాధాకృష్ణ‌(15), శ్రీరాముల శివాజీ(17)గా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. విద్యార్థుల త‌ల్లీదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.