శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 09:43:47

పైపులైన్‌ నుంచి ఏవియేషన్‌ ఫ్యూయల్‌ అపహరిస్తున్న ముఠా అరెస్టు

పైపులైన్‌ నుంచి ఏవియేషన్‌ ఫ్యూయల్‌ అపహరిస్తున్న ముఠా అరెస్టు

సోనిపట్ :  హర్యానాలోని సోనిపట్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) పైప్‌లైన్ల నుంచి విమాన ఇంధనం (ఏవియేషన్‌ ఫ్యూయల్‌) అపహరణకు పాల్పడుతున్న ముఠాను ఆదివారం ఢిల్లీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బృందం అరెస్టు చేసింది. వీరి నుంచి ట్యాంకర్ ట్రక్, 1100 లీటర్ల ఏవియేషన్ ఇంధనం, రూ .60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన సమయ్ పాల్, ముఖేశ్‌, సంజయ్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన హిమాన్షు, అవ్లేష్ ముఠాగా ఏర్పడి విమానం ఇంధనం చోరీ చేస్తున్నట్లు  గుర్తించారు. దొంగిలించిన ఇంధనాన్ని హర్యానాలోని నిహాల్ విహార్ ప్రాంతానికి చెందిన సంజయ్ ధావన్ అనే వ్యాపారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులతోపాటు వ్యాపారిని అరెస్టు చేశామని వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo