శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 20:30:21

రూ.కోటి కోసం.. 5వ తరగతి విద్యార్థి కిడ్నాప్‌, హత్య

రూ.కోటి కోసం.. 5వ తరగతి విద్యార్థి కిడ్నాప్‌, హత్య

గోరఖ్‌పూర్‌ : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం గోరఖ్‌పూర్‌లో రూ.కోటి రూపాయల కోసం ఐదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇప్పుడు ఈ హత్య అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ వరుస విమర్శలు చేస్తున్నాయి. 

పోలీసులు తెలిపిన వివరాలు.. గోరఖ్‌పూర్‌కు చెందిన పాన్ షాపు నిర్వాహకుడి కుమారుడిని జూలై 26న దుండగులు కిడ్నాప్‌ చేశారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి బాలుడు కిడ్నాప్‌కు గురి కావడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చిన్నారిని రక్షించడానికి అనేక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని విడిపించేందుకు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌)ను కూడా రంగంలోకి దించారు.

ఈ నేపథ్యంలో కిడ్నాపర్లు రూ.కోటిని డిమాండ్‌ చేసినట్లు చేసి పోలీసుల శోధన కొనసాగుతుండగానే బాలుడిని హత్య చేశారు. ఎస్‌టీఎఫ్‌ బృందం బాలుడి మృతదేహాన్ని కనుగొని కుటుంబ సభ్యులకు అందజేసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చిన్నారిని హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ సంఘటనపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేస్తూ ‘‘యూపీ చీఫ్‌ ఇలాంటి వార్తలను చూడటం మానేశారా?’’ అని ప్రశ్నించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo