శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 21, 2020 , 19:20:54

భద్రాచలంలో 590 కేజీల గంజాయి పట్టివేత

భద్రాచలంలో 590 కేజీల గంజాయి పట్టివేత

భద్రాచలం: భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు బుధవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏఎస్పీ రాజేష్‌ చంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ సీఐ టి స్వామి, ఎస్సై బి మహేశ్‌ భద్రాచలం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌జే(11జీఏ 6038) అనే నెంబర్‌ గల లారీని, డీఎల్‌ 5 సీజీ (1481) అనే నెంబర్‌ గల సపారీ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 563 కేజీల గంజాయి, సపారీ వాహనంలో 27 కేజీలు మొత్తం 590 కేజీల గంజాయి లభ్యమయింది. దీని విలువ మార్కెట్‌లో సుమారుగా రూ.88,50,000లుగా ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. కాగా పట్టుకున్న వారిని విచారించగా ఆగ్రా, ఢిల్లీలకు చెందిన హరివీర్‌సింగ్‌, సంజయ్‌ కుమార్‌, లకన్‌ సింగ్‌, జాకీర్‌, నవీన్‌లుగా తేలిందని వివరాలను వెల్లడించారు.