బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 08, 2020 , 10:44:59

ఆవుపై అఘాయిత్యం.. కామాంధుడు అరెస్టు

ఆవుపై అఘాయిత్యం.. కామాంధుడు అరెస్టు

భోపాల్ : ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మూగ‌జీవిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్ లోని సుంద‌ర్ న‌గ‌ర్ లో జులై 4న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఓ 55 ఏళ్ల వ్య‌క్తి జులై 4న తెల్ల‌వారుజామున‌.. సుంద‌ర్ న‌గ‌ర్ లోని ఓ డైరీ ఫామ్ లోకి వెళ్లాడు. అక్క‌డున్న ఓ ఆవుపై అస‌హ‌జ శృంగారం చేశాడు. దీంతో ఆవు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది.

డైరీ య‌జ‌మాని రామ్ యాద‌వ్.. ఆవు అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యాన్ని గ‌మ‌నించాడు. ఆవుకు ఎవ‌రైనా ఏమైనా చేశారా? అన్న కోణంలో య‌జ‌మాని ఆలోచించాడు. డైరీ ఫామ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ప‌రిశీలించాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా రామ్ యాద‌వ్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ష‌బ్బీర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. 


logo