సోమవారం 08 మార్చి 2021
Crime - Jan 19, 2021 , 09:45:34

హైద‌రాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం

హైద‌రాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం

హైద‌రాబాద్ : న‌గ‌రంలో అక్ర‌మంగా గంజాయిని విక్ర‌యిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను ఛ‌త్రినాక పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైద‌రాబాద్‌లో విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ముగ్గురు ముఠా స‌భ్యుల‌కు మ‌రికొంత మంది డ్ర‌గ్స్ గ్యాంగ్‌ల‌తో సంబంధాలున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

VIDEOS

logo