50 ఏండ్ల మహిళపై అత్యాచారం.. ప్రయివేటు భాగాల్లోకి..

లక్నో : దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం చోటు చేసుకున్న రీతిలోనే యూపీలోని బదౌన్ జిల్లాలో అలాంటి తరహా ఘటనే జరిగింది. ఓ 50 ఏండ్ల మహిళపై ముగ్గురు కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమె ప్రయివేటు భాగాల్లోకి ఇనుపరాడ్లను నెట్టి హత్య చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బదౌన్ జిల్లాలోని ఉగైతి ఏరియాకు చెందిన ఓ 50 ఏండ్ల మహిళ వృత్తిరీత్యా అంగన్వాడీ టీచర్. ఆమె స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి ప్రతిరోజు వెళ్తుండేది. అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు గుడికి వెళ్లింది. అక్కడున్న పూజారితో పాటు మరో ఇద్దరు కలిసి అంగన్వాడీ టీచర్‌ను నిర్బంధించారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ప్రయివేటు భాగాల్లోకి ఇనుపరాడ్లు నెట్టారు. ఆ మహిళ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించి పైశాచిక ఆనందం పొందారు.
ఏమీ తెలియనట్లు..
ఇక పూజారి చేసిందంతా చేసి తనకేమీ తెలియనట్లు నాటకమాడాడు. ఆలయానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయిందని తెలిపాడు. అక్కడే ఉన్న మరో ఇద్దరి సహాయంతో బావిలో నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చామని చెప్పాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆమెను ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లామని తెలిపాడు. అప్పటికీ ఆ మహిళ ప్రాణాలతో ఉన్నదని పేర్కొన్నాడు పూజారి.
వెలుగు చూసిందిలా..
బాధిత మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆమెకు పోస్టుమార్టం నిర్వహించగా అత్యాచారానికి గురైనట్లు తేలింది.
ప్రయివేటు భాగాల్లోకి ఇనుపరాడ్లు, దెబ్బతిన్న ఊపిరితిత్తులు
అంగన్వాడీ టీచర్ పట్ల ఆ క్రూర మృగాలు అత్యంత దారుణంగా ప్రవర్తించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె ప్రయివేటు భాగాల్లోకి ఇనుపరాడ్లు నెట్టడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. పలు ఎముకలు విరిగిపోయాయి. ఓ కాలు కూడా విరిగిపోయినట్లు నివేదికలో వెల్లడైంది.
పోలీసు కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పూజారితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు.
తాజావార్తలు
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్‌పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం