గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 08, 2020 , 16:33:47

మేన‌కోడ‌లిపై లైంగిక వేధింపులు.. అరెస్ట్‌

మేన‌కోడ‌లిపై లైంగిక వేధింపులు.. అరెస్ట్‌

హైదరాబాద్ : 50 ఏళ్ల వ్యక్తి తన 20ఏండ్ల మేనకోడలిపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ‌గా.. సోమ‌వారం పేట్‌బ‌షీరాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌తి లాక్‌డౌన్ అనంత‌రం ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చి త‌న మేన‌మామ ఇంట్లో నివాసం ఉంది. ఆ స‌మ‌యంలో 50 ఏండ్ల మేన‌మామ ఆమెపై ప‌లుమార్లు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌గా విసుగు చెందిన యువ‌తి అక్క‌డి నుంచి హాస్ట‌ల్‌కు మ‌కాం మార్చింది. ఆ త‌రువాత అత‌డి వికృత చేష్ట‌ల గురించి కుటుంబ స‌భ్యుల‌కు తెలిపి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిపై కేసు న‌మోదు చేసి సోమ‌వారం అరెస్టు చేసిన‌ట్లు వారు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo