ఆరేండ్ల చిన్నారిపై 50 ఏండ్ల వ్యక్తి అత్యాచారం...

అమరావతి : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అభం శుభం తెలియని ఒక ఆరేండ్ల చిన్నారిపై 50ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్న పాపను, భుజాలపై ఎక్కించుకుని తీసుకు వెళ్లిన వ్యక్తి బాలికపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.పేరేచర్ల శివ పార్వతి కాలనీకి చెందిన ఆరేళ్ళ చిన్నారి, తమ బంధువైన మరో బాలుడితో కలిసి పేరేచర్ల కూడలి వద్ద ఆడుకుంటోంది. అయితే కొంత సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో బాలుడు, బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. కంగారు పడ్డ తల్లిదండ్రులు మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిన్నారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చిన్నారి ఆడుకున్న కూడలిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో చిన్నారి ఒక 50 ఏండ్ల వ్యక్తి తన భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతన్ని నల్లపాడుకు చెందిన స్వామిగా గుర్తించారు పోలీసులు.
పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి చిన్నారి కనిపించగా ఆమెపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన పోలీసులు, వైద్య చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు స్వామిని అరెస్ట్ చేసి, తమదైన శైలిలో విచారణ చేయగా చిన్నారిపై రైల్వేస్టేషన్ సమీపంలో లైంగిక దాడి చేసినట్లుగా నిందితుడు నేరాన్ని అంగీకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
- దుబాయ్లో ఘనంగా నమ్రత బర్త్డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్
- నల్లాకు మీటర్.. ‘క్యాన్'కు ఆధార్ ఉండాల్సిందే