మంగళవారం 24 నవంబర్ 2020
Crime - Oct 26, 2020 , 13:01:51

శామీర్‌పేట‌లో అదృశ్య‌మైన బాలుడు మృతి

శామీర్‌పేట‌లో అదృశ్య‌మైన బాలుడు మృతి

మేడ్చ‌ల్ మల్కాజ్‌గిరి : ఈ నెల 15వ తేదీన శామీర్‌పేట‌లో అదృశ్య‌మైన బాలుడు మృతి చెందాడు. శామీర్‌పేట ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌క్క‌న బాలుడి మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఈ నెల 15వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో అతియాన్‌(5) అనే అబ్బాయి అదృశ్య‌మైన విష‌యం తెలిసిందే. అదే రోజు త‌మ అబ్బాయి కనిపించ‌డం లేదంటూ అత‌ని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇవాళ ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ద్ద బాలుడి మృత‌దేహం ల‌భ్య‌మైంది. బాలుడిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతి కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.