గురువారం 28 జనవరి 2021
Crime - Oct 10, 2020 , 13:42:04

ట్యూషన్‌కు వెళ్లిన ఐదేండ్ల బాలికపై లైంగికదాడి

ట్యూషన్‌కు వెళ్లిన ఐదేండ్ల బాలికపై లైంగికదాడి

హర్దోయ్‌ : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతో నిత్యం ఏదో ఓ చోట మృగాళ్ల అకృత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. శనివారం హర్దోయ్‌ జిల్లా కేంద్రంలోని శాండిలా ప్రాంతంలో ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. శాండిలా ప్రాంతానికి చెందిన బాలిక సమీపంలోని ఓ వ్యక్తి ఇంటికి నిత్యం ట్యూషన్‌కు వెళ్తుంది. ఈ ఉదయం ట్యూషన్‌కు వెళ్లిన బాలికపై ట్యూషన్‌ టీచర్‌ సోదరుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పటల్‌కు పంపి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అనురాగ్‌ వ్యాస్‌ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo