పాట్నా: ఐదేండ్ల బాలుడిపై ఇంటి యజమాని మనవడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. రామకృష్ణనగర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండే బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమానికి చెందిన 11 ఏండ్ల మనవడు తమ కుమారుడిపై మూడు నెలల కిందట లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ విషయాన్ని తమ బాబు ఇటీవల చెప్పాడని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు ఇంటి యజమాని ఈ ఆరోపణలను ఖండించారు. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలుడి కుటుంబం గత నాలుగు నెలులుగా ఇంటి అద్దె చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో తమ మనవడుపై తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. అయితే బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఈ కేసులో అసలు వాస్తవం ఏమిటన్నది తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.