మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 23, 2020 , 14:23:26

నదిలో పడిన కారు.. ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు గల్లంతు

నదిలో పడిన కారు.. ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు గల్లంతు

శ్రీనగర్: నదిలో ఒక కారు పడిన ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు గల్లంతయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రామ్‌నగర్ సమీపంలోని నదిలోకి దూసుకెళ్లింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధ్రుతంగా ఉన్నదని, గల్లంతైన మిగతా వారి కోసం గాలించడం చాలా కష్టంగా ఉన్నదని పోలీసు అధికారులు తెలిపారు.logo