బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 09, 2020 , 18:26:47

5 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం

5 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌ జిల్లా బుభన్‌భాట్‌ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. 40వ బెటాలియన్‌కు చెందిన ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసులు భుభన్‌భాట్‌ గ్రామ శివారులోని కోర్బా అటవీ ప్రాంతంలో పోలీసులతో కలిసి సంయుక్త తనిఖీ ఆపరేషన్‌ చేపట్టాయి. అటవీ ప్రాంతంలో దాదాపు 5 కిలోల ఐఈడీ (ఇంఫ్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీతో నక్సల్స్‌ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో నక్సల్స్‌ ప్రభావం అధికంగా ఉండటంతో పోలీసులు, ఐటీబీపీ సిబ్బంది కూంబింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.