శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 21:59:02

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురికి గాయాలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురికి గాయాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిలీలోని టిగ్రి ప్రాంతంలోని జేజే క్యాంపులో ఎల్‌పీజీ సిలిండర్ పేలి ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందితోపాటు సీనియర్ పోలీసు అధికారులు అక్కడికక్కడే ఉన్నారు. పేలుడు జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది ఫైర్ టెండర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను వ్యాపించకుండా అదుపు చేశారు.


logo