మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 21, 2020 , 10:07:42

లోయలో పడ్డ బస్సు.. ఐదుగురి దుర్మరణం

లోయలో పడ్డ బస్సు.. ఐదుగురి దుర్మరణం

ముంబై : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సూరత్‌కు వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడగా.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 35 మందికి గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఖామ్‌చౌందర్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని నందూర్బార్‌ ఎస్పీ సందర్శించారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని, 35 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, బస్సు మల్కాపూర్‌ నుంచి సూరత్‌కు వెళ్తుండగా పూణే-సోలాపూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇందులో డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు.  పూణే-సోలాపూర్ హైవే 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు ఎనిమిది మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.