బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 12:12:26

సీఎం సంతకం ఫోర్జరీ.. ‘సీఎంఆర్‌ఎఫ్‌’ డబ్బు కొల్లగొట్టి జైలుపాలు..

సీఎం సంతకం ఫోర్జరీ.. ‘సీఎంఆర్‌ఎఫ్‌’ డబ్బు కొల్లగొట్టి జైలుపాలు..

లక్నో : అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సీఎం సహాయనిధి నుంచి డబ్బులు కొల్లగొట్టిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సీఎం సహాయనిధి లావాదేవీల్లో తేడాలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు గుర్తించారు. విషయంపై దర్యాప్తు చేసి 15 రోజుల్లో నిందితులను అరెస్టు చేయాలని స్పెషల్ విజిలెన్స్ సెల్‌ను సీఎం ఆదేశించారు.

హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని పలు బ్యాంకుల నుంచి చెక్కుల ద్వారా డబ్బు ఉపసంహరించినట్లు గుర్తించిన స్పెషల్ విజిలెన్స్ సెల్‌ ఎస్పీ రోసీ కలిత గత నెల 12న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యూపీలోని గోరఖ్‌పూర్, బస్తీ ప్రాంతాలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం నిందితులు ఇదే తరహాలో డబ్బును ఉపసంహరించుకున్నారని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. డబ్బును సంబంధిత జాతీయం బ్యాంకులు తిరిగి తమకు అప్పగించినట్లు కలిత వెల్లడించారు. తమకు పూర్తిగా సహకరించిన యూపీ ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo