శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 16:59:18

గోవాలో హోటల్‌పై రైడ్‌.. 42 మంది పర్యాటకులు అరెస్టు

గోవాలో హోటల్‌పై రైడ్‌.. 42 మంది పర్యాటకులు అరెస్టు

పనాజీ : గోవాలోని ఓ హోట‌ల్‌పై రైడ్ చేసిన పోలీసులు 42 మంది ప‌ర్యాట‌కుల‌ను అరెస్టు చేశారు. ప‌నాజీ స‌మీపంలోని క‌లాంగూట్ బీచ్ గ్రామంలోని గ్యాంబ్లింగ్ డెన్‌పై పోలీసులు గ‌డిచిన అర్థ‌రాత్రి రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జూదం ఆడుతున్న 42 మంది ప‌ర్యాట‌కుల‌ను అరెస్టు చేయ‌డంతో పాటు సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు, 57 మొబైల్ ఫోన్స్‌, ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గుజ‌రాత్‌, మ‌హారాష్ర్ట‌, న్యూఢిల్లీ చెందిన ప‌ర్యాట‌కులంతా హోట‌ల్ ఐదో అంత‌స్థులో పేకాట ఆడుతున్నారు. నిందితులంద‌రిపై గోవా, డామ‌న్  అండ్ డ‌య్యూ ప‌బ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసు అధికారి ఒక‌రు చెప్పారు. అదేవిధంగా హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ రాష్ర్ట ప‌ర్యాట‌క‌శాఖ‌కు లేఖ రాసిన‌ట్లు తెలిపారు. 


logo