శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 09:06:52

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య

నాగ్‌పూర్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. అమర్ శివలాల్‌ చౌదరి (40) ఓ అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడతుండేవాడు. ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గత నెల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన అతడు శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వద్ద సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అజ్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo