మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 15:52:02

దుబాయ్‌లో మద్యం మత్తులో మహిళను తాకినందుకు..

దుబాయ్‌లో మద్యం మత్తులో మహిళను తాకినందుకు..

దుబాయ్‌ : దుబాయ్‌లో మద్యం మత్తులో మహిళను తాకి అరెస్టయిన భారత సంతతి వ్యక్తిపై కోర్టు లైంగిక వేధింపులు, అక్రమంగా మద్యం సేవించినట్లు అభియోగాలు మోపింది. ఆదివారం కేసు తొలి దఫా విచారణ జరిగింది. జూన్‌లో తన నివాసం సమీపంలో వ్యాయామం చేస్తున్నమహిళను మద్యం మత్తులో ప్రవాస భారతీయుడు(40) తాకాడు.

బాధితురాలు పోలీస్ కమాండ్ రూమ్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏడుస్తున్న బాధితురాలిని కలిశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన తప్పు ఒప్పుకున్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo