Crime
- Dec 13, 2020 , 22:09:00
ధరంగఢ్ టు హైదరాబాద్ బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

భువనేశ్వర్: ఒడిశాలోని ధరంగఢ్ నుంచి హైదరాబాద్కు ప్రయాణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కలహండి జిల్లాలోని కొక్సర సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురు హైదరాబాద్లో నివసిస్తున్న వారు ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
MOST READ
TRENDING