సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 02, 2020 , 16:05:56

బూరతో ఆడుకుంటుండగా.. గొంతులో అడ్డుపడి బాలుడు మృతి

బూరతో ఆడుకుంటుండగా.. గొంతులో అడ్డుపడి బాలుడు మృతి

ముంబై: బూరతో ఆడుకుంటుండగా పొరపాటున గొంతులో అడ్డుపడటంతో ఓ బాలుడు మరణించాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ విషాద ఘటన జరిగింది. అంధేరీలోని ఓ కుటుంబానికి చెందిన నాలుగేండ్ల బాలుడు దేవ్‌రాజ్‌ నాగ్‌ ఆదివారం తన సోదరితో కలిసి బూర ఊదుతూ, గాలి వదులుతూ ఆడుతున్నాడు. కాగా పడుకొని ఆడుతున్న దేవ్‌రాజ్ గొంతులో గాలి తగ్గిన బూర అడ్డుపడింది. అది మరింత లోపలికి వెళ్లడంతో ఊపిరి అందక ఆ బాలుడు ఇబ్బందిపడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో నానావతి దవాఖానకు ఆ బాలుడ్ని తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. కూపర్ దవాఖానలో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు గొంతు లోపల ఇరుకున్న బూరను బయటకు తీశారు. వాయు మార్గానికి బూర అడ్డుపడటంతో ఊపిరి అందక చనిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.