సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 03, 2020 , 11:07:42

బెలూన్‌ను మింగిన బాలుడు మృతి

బెలూన్‌ను మింగిన బాలుడు మృతి

ముంబై : ఓ నాలుగేళ్ల బాలుడు బెలూన్స్‌తో ఆడుకుంటూ ఒక‌దాన్ని మింగేశాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైలోని అంధేరిలో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. దేవ‌రాజు అనే బాలుడు త‌న సోద‌రితో క‌లిసి బెలూన్స్ ఊదారు. ఈ క్ర‌మంలో దేవ‌రాజు ఓ బెలూన్‌ను మింగేశాడు. విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు బెలూన్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో బాధిత బాలుడిని అంధేరిలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు బాలుడిని ప‌రీక్షించి.. నానావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని సూచించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లోనే బాలుడు క‌న్నుమూశాడు. పోస్టుమార్టం నిర్వ‌హించిన వైద్యులు.. అత‌ని గొంతులో నుంచి బెలూన్‌ను బ‌య‌ట‌కు తీశారు. 


logo