మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 22, 2020 , 13:32:11

ఒకే కుటుంబంలో న‌లుగురు హ‌త్య‌

ఒకే కుటుంబంలో న‌లుగురు హ‌త్య‌

రాయ్‌పూర్ : ఒకే కుటుంబంలో న‌లుగురు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్ జిల్లాలో సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. అమ‌లేశ్వ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఖుద్‌ముద గ్రామానికి చెందిన బాల‌రాజ్ సోంక‌ర్‌(60), దులారిన్ భాయ్‌(55) దంప‌తుల‌కు కుమారుడు రోహిత్‌(30), కోడలు కిర్తిన్‌, ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల మ‌నువ‌డు ఉన్నాడు. వీరంతా ఒకే ఇంట్లో నివాస‌ముంటున్నారు.  సోంక‌ర్ కుటుంబం మొత్తం వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఊరికి స‌మీపంలోని పొలంలోనే గుడిసె వేసుకుని ఉంటున్నారు. అయితే సోమ‌వారం ఉద‌యం సోంక‌ర్‌, రోహిత్ మృత‌దేహాలు పొలం వ‌ద్ద బావి వ‌ద్ద ల‌భ్య‌మ‌య్యాయి. దులారిన్ భాయ్‌, కిర్తిన్ గుడిసెలోనే హ‌త్య‌కు గుర‌య్యారు. పిల్లోడి తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్నాడు. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు న‌లుగురి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సోంక‌ర్ కుటుంబానికి ఎవ‌రితో శ‌త్రుత్వం లేద‌ని స్థానికులు తెలిపారు. సోంక‌ర్ కుటుంబం హ‌త్య‌కు గల కార‌ణాల‌పై పోలీసులు దృష్టి సారించారు. నాలుగు బృందాలుగా ఏర్ప‌డి పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.


logo