మంగళవారం 26 జనవరి 2021
Crime - Sep 19, 2020 , 19:18:04

ఇద్ద‌రు మైన‌ర్ల‌తో స‌హా ఒకే కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌

ఇద్ద‌రు మైన‌ర్ల‌తో స‌హా ఒకే కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌

జైపూర్ : ఇద్ద‌రు మైన‌ర్ల‌తో స‌హా ఒకే కుటుంబంలోని న‌లుగురు వ్య‌క్తులు ఉరేసుకుని సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ విషాద సంఘ‌ట‌న రాజ‌స్తాన్‌లోని జండోలీ ప్రాంతంలో శ‌నివారం చోటుచేసుకుంది. మృతుల‌ను య‌శ్వంత్ సోనీ, మ‌మ‌తా సోనీ వీరి పిల్ల‌లు భ‌ర‌త్‌, అజిత్‌గా గుర్తించారు. య‌శ్వంత్ సోనీ సోద‌రుడు ఇంటికి వ‌చ్చి చూడ‌గా విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆర్థిక వివాదాల కార‌ణంగా కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురైన‌ట్లుగా ప్రాథ‌మిక స‌మాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను త‌రలించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.


logo