మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 02, 2020 , 17:29:53

సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండ‌గా న‌లుగురు మృతి

సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండ‌గా న‌లుగురు మృతి

చెన్నై : సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండ‌గా ఊపిరాడ‌క న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. చెక్క‌ర‌కూడి గ్రామంలో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసేందుకు ఇద్ద‌రు కార్మికులు దానిలోకి దిగారు. వారిద్ద‌రికి ఊపిరాడ‌క‌పోవ‌డంతో కేక‌లు వేశారు. వీరిద్ద‌రిని ర‌క్షించేందుకు మరో ఇద్ద‌రు ట్యాంకులోకి దిగారు. మొత్తానికి న‌లుగురికి ఊపిరాడ‌లేదు. దీంతో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 


logo