మంగళవారం 04 ఆగస్టు 2020
Crime - Jul 03, 2020 , 20:59:27

అనుమానాస్పదంగా ముగ్గురు మృతి

అనుమానాస్పదంగా ముగ్గురు మృతి

బోద్‌పూర్‌ : రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ జిల్లాలోని శంకర్‌నగర్‌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.  స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు అదేప్రాంతానికి చెందిన రాజేంద్ర, అతడి భార్య ఇందిర కుమారుడు నితిన్‌గా గుర్తించారు. వీరిలో ఒకరు ఉరేసుకోగా ఇద్దరి మృతదేహాలు మంచంపై పడి ఉన్నారని తెలిపారు. ఇంట్లో సూసైడ్‌ నోట్ లభించలేదని అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌శర్మ తెలిపారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ పరిశోధన బృందాలు  ఆధారాలు సేకరించారు. ముగ్గురి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసు  కొలిక్కి వచ్చే అవకాశముందని వెల్లడించారు.logo