గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Sep 24, 2020 , 13:20:36

ఖాకీ అవ‌తార‌మెత్తిన లారీ డ్రైవ‌ర్.. 40 మందిపై అత్యాచారం

ఖాకీ అవ‌తార‌మెత్తిన లారీ డ్రైవ‌ర్.. 40 మందిపై అత్యాచారం

చెన్నై : ఓ లారీ డ్రైవ‌ర్ పోలీసు అవ‌తార‌మెత్తి.. సుమారు 40 మందికి పైగా మ‌హిళ‌ల‌ను అత్యాచారం చేశాడు. త‌మిళ‌నాడుకు చెందిన ఓ 35 ఏళ్ల వ్య‌క్తి వృత్తిరీత్యా లారీ డ్రైవ‌ర్‌. ఈ క్ర‌మంలో అత‌నికి మ‌హిళ‌లు, యువ‌తుల‌పై క‌న్నుప‌డింది. దీంతో ఆ లారీ డ్రైవ‌ర్ పోలీసు దుస్తులు ధ‌రించి పుజ‌ల్, రెడ్ హిల్స్ ఏరియాల్లో బైక్‌పై తిరిగేవాడు. ఇక మ‌హిళ‌లు, యువ‌తులు ప్ర‌యివేటుగా ఉన్న స‌మ‌యంలో వారి చిత్రాలు చిత్రీక‌రించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను పోలీసున‌ని బెదిరించి.. అత్యాచారాలు చేసేవాడు. ఒక‌రిద్ద‌రిని కాదు ఏకంగా 40 మంది మ‌హిళ‌ల‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అయితే ఇటీవ‌ల ఓ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రెండు రోజుల క్రితం లారీ డ్రైవ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.