బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 20, 2020 , 13:48:42

ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య..

ప్రియురాలి ఇంట్లోనే  ప్రియుడు ఆత్మహత్య..

కోటా : రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోరం జరిగింది. ప్రియురాలు ఇంట్లోనే ప్రియుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటా జిల్లా కేంద్రంలోని మహావీర్ నగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మ (32) వివాహం చేసుకుని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శనివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి  గడిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ప్రియురాలు నిద్రిస్తున్న పక్కగదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం గుర్తించిన ఆమె అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo