శుక్రవారం 03 జూలై 2020
Crime - Feb 26, 2020 , 06:32:48

ఊటీ వెళ్లొచ్చే సరికి.. ఇల్లు లూటీ

ఊటీ వెళ్లొచ్చే సరికి.. ఇల్లు లూటీ

హైదరాబాద్ : పెండ్లి రోజు వేడుకలు ఆనందంగా జరుపుకునేందుకు ఊటీకి  వెళ్లి .. వచ్చే సరికి ఇల్లు లూటీ చేశారు. ఈ ఘటన నగరంలోని నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీఐ సైదులు కథనం ప్రకారం..  కాకినాడ ఇంద్రపాలెంకు చెందిన అనుసూరి శివశంకర్‌ (34).. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తూ నల్లకుంట తిలక్‌నగర్‌లో భార్యతో కలసి ఉంటున్నాడు.. కాగా..  పెండ్లి రోజు వేడుకలు జరుపుకునేందుకు గత శనివారం తమిళనాడు రాష్ట్రం ఊటీకి వెళ్లా రు. సోమవారం ఉదయం కిటికీలు తెరిచి ఉండగా ఇంటి యజమాని ప్రసాద్‌ అనుమానంతో శివశంకర్‌కు ఫోన్‌ చేశాడు. మంగళవారం ఉదయం ఊటీ నుంచి తిరిగి వచ్చిన శివశంకర్‌ ఇంట్లోకి వె ళ్లి చూడగా  ..బీరువాలో ఉన్న 32 తులాల బంగారు ఆభరణాల తో పాటు కిలో వెండి వస్తువులు కనిపించలేదు.  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


logo