ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 14:54:31

31 ఫ్లాప్షెల్‌ తాబేళ్ల మృతి

31 ఫ్లాప్షెల్‌ తాబేళ్ల మృతి

వడోదర : గుజరాత్‌ రాష్ట్రం వడోదర పరిధిలోని కమలానగర్‌ సరస్సులో అనుమానాస్పద స్థితిలో 31ఫ్లాప్షెల్‌ తాబేళ్లు మృతి చెందాయి. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన కొందరు సరస్సులో తాబేళ్ల కళేబరాలను గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని కళేబరాలను బయటకు తీశారు. కళేబరాలను పోస్టుమార్టంకు పంపామని నివేదిక వస్తే తాబేళ్ల మృతికి గల కారణాలు తెలుస్తామని అటవీ రేంజ్‌ అధికారి నిధిదేవ్‌ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు చేపడతామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా తాబేళ్ల మృతిపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నీటిలో ప్రాణాంతక రసాయనాలు కలవడం వల్లే అవి మృతి చెందాయని కొందరు ఆరోపిస్తుండగా  కాలుష్యం పెరగడమే కారణమని మరికొందరు అంటున్నారు.


logo