మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 25, 2020 , 11:56:57

రూ. 12 లక్షల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం

రూ. 12 లక్షల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం

 సంగారెడ్డి : జిల్లాలోని మొగుడంపల్లి మండలం ఉప్పర్ పల్లిలో గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. అల్లం పంటలో అక్రమంగా గంజాయి సాగు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. శుక్రవారం దాడులు నిర్వహించి సుమారు 300 మొక్కలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.


logo