గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 10:42:11

మూడేళ్ల బాలిక‌పై అత్యాచారం చేసి హ‌త్య‌

మూడేళ్ల బాలిక‌పై అత్యాచారం చేసి హ‌త్య‌

ల‌క్నో : ముక్కు ప‌చ్చ‌లార‌ని ఓ ప‌సిబిడ్డ‌పై మాన‌వ మృగాలు విరుచుకుప‌డ్డాయి. కామాంధులు ఆ బిడ్డ‌ను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలో గురువారం ఉద‌యం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక బుధ‌వారం అదృశ్య‌మైంది. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం గాలించారు. గురువారం ఉద‌యం గ్రామానికి అర కిలోమీట‌ర్ దూరంలో బిడ్డ మృత‌దేహం ల‌భ్య‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి మృత‌దేహాన్ని త‌ర‌లించారు. అయితే బాలిక‌పై అత్యాచారం చేసి, హ‌త్య చేసిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి అయిన‌ట్లు పోలీసులు తెలిపారు. 

పాత‌కక్ష‌ల కార‌ణంగానే త‌న బిడ్డ‌ను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని మృతురాలి తండ్రి త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ల‌ఖింపూర్‌ఖేరీ జిల్లాలో గ‌త 20 రోజుల్లో ఈ అత్యాచార ఘ‌ట‌న మూడోది. 

ఓ 17 ఏళ్ల యువ‌తి స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు కోసం వెళ్ల‌గా, ఆమెపై కొంద‌రు దుండ‌గులు అత్యాచారం చేసి చంపేశారు. మ‌రో 13 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. యోగి ప్ర‌భుత్వంలో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని విప‌క్ష పార్టీలు ధ్వ‌జ‌మెత్తాయి. కామాంధుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.


logo