శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 21, 2020 , 17:18:53

ఫ్యాన్ కు వేలాడుతున్న త‌ల్లి.. గుక్క‌ప‌ట్టి ఏడ్చిన మూడేళ్ల చిన్నారి

ఫ్యాన్ కు వేలాడుతున్న త‌ల్లి.. గుక్క‌ప‌ట్టి ఏడ్చిన మూడేళ్ల చిన్నారి

ముంబై : ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఓ త‌ల్లి ఫ్యాన్ కు ఉరేసుకుంది.. మూడేళ్ల బిడ్డ త‌ల్లిని చూస్తూ గుక్క‌ప‌ట్టి గంట‌ల కొద్ది ఏడ్చింది. కానీ ఉరేసుకున్న త‌ల్లి మాత్రం కొన ఊపిరితో ఉంది. చివ‌ర‌కు ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పోలీసులు.. ఆమె ప్రాణాల‌ను కాపాడారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట న‌వీ ముంబైలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

న‌వీ ముంబైలోని ఉల్వే ఏరియాలో ఓ మ‌హిళ త‌న మూడేళ్ల కుమార్తెతో క‌లిసి నివ‌సిస్తోంది. ఏమైందో తెలియ‌దు కానీ.. ఆ మ‌హిళ త‌న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుంది. దీంతో బిడ్డ తీవ్రంగా ఏడ్వ‌సాగింది. పాప ఏడుపు విన్న స్థానికులు.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటి త‌లుపుల‌ను ప‌గుల‌గొట్టి లోప‌లికి వెళ్లారు.

బెడ్రూంలో పాప ఏడుస్తూ ఉన్న‌ది. త‌ల్లేమో ఫ్యాన్ కు వేలాడుతున్న‌ది. అయితే మ‌హిళ‌లో క‌ద‌లిక‌లు ఉన్నాయి. మెల్ల‌గా శ్వాస తీసుకుంటుంది. దీంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతానికి బాధితురాలి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. 


logo