శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 15, 2020 , 19:22:31

ఎద్దుల బండి బోల్తా : మూడేళ్ల బాలుడు మృతి

ఎద్దుల బండి బోల్తా : మూడేళ్ల బాలుడు మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఎద్దుల బండి బోల్తా ప‌డ‌డంతో.. దానిపై ప్ర‌యాణిస్తున్న ఓ మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘ‌ట‌న చింత‌ల‌మానేప‌ల్లి మండ‌లంలోని క‌ర్జేల్లి గ్రామంలో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన అంజ‌న్న‌, సంధ్య దంప‌తులు వృత్తిరీత్యా వ్య‌వ‌సాయ‌దారులు. ఈ క్ర‌మంలో పొలం వ‌ద్ద‌కు ఎరువుల సంచులను ఎద్దుల బండిపై తీసుకెళ్తున్నారు. ఈ బండిపై అంజ‌న్న‌తో పాటు సంధ్య‌, కుమారుడు కుబిడే వ‌రుణ్‌(3) కూడా ఉన్నాడు. దారి మ‌ధ్య‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు ఎద్దుల బండి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో వ‌రుణ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఎరువుల సంచుల‌న్నీ బాలుడిపై ప‌డ‌డంతో.. అత‌నికి ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo