శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 19:23:01

నాణెం మింగిన బాలుడు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి

నాణెం మింగిన బాలుడు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి

తిరువనంతపురం: నాణేం మింగిన బాలుడి పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మూడేళ్లకే ఆ చిన్నారి బుడతడికి నూరేళ్లునిండాయి. ఈ విషాదకర ఘటన కేరళలో జరిగింది. మూడేండ్ల బాలుడు పొరపాటున ఒక నాణేన్ని మింగేశాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తొలుత ఎర్నాకుళం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదు. దీంతో బాలుడ్ని అలప్పుజ మెడికల్ కాలేజీ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే బాలుడి తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉండటంతో చికిత్సకు నిరాకరించారు. దీంతో నాణేం మింగిన బాలుడు శ్వాస ఆడక మరణించాడు. కాగా, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యం చేయకపోవడం వల్లనే తమ బిడ్డ మరణించినట్లు బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు.logo