బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 22, 2020 , 16:51:18

11 ఏళ్ల బాలిక‌పై ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు అత్యాచారం

11 ఏళ్ల బాలిక‌పై ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు అత్యాచారం

చెన్నై : అభం శుభం తెలియ‌ని ఓ బాలిక‌పై ముగ్గురు విద్యార్థులు విరుచుకుప‌డ్డారు. ఆ బాలిక‌పై ముగ్గురు ప‌లుమార్లు అత్యాచారం చేశారు. బ‌య‌ట‌కు చెప్తే చంపేస్తామ‌ని బెదిరించారు. ఈ దారుణ ఘ‌ట‌న కోయంబ‌త్తూర్ లోని సుంద‌ర‌పురం ఏరియాలో ఇటీవ‌లే చోటు చేసుకుంది. 

ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌కు త‌ల్లి లేదు. కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో త‌ల్లి చ‌నిపోయింది. తండ్రి వ‌ద్దే ఆమె ఉంటోంది. రోజువారీ ప‌నులు చేస్తూ వ‌చ్చిన సంపాద‌న‌తో.. తండ్రి బిడ్డ‌ను పోషిస్తున్నాడు. అయితే తండ్రిబిడ్డ‌లు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 

తండ్రి ప‌నికి వెళ్లిన త‌ర్వాత టీవీ చూసేందుకు బాలిక‌.. గ్రౌండ్ ఫ్లోర్ లోని త‌న ఓన‌ర్ ఇంట్లోకి వెళ్లేది. ఇటీవ‌లే ఓన‌ర్ కుమారుడికి ఆన్ లైన్ క్లాసులు వినేందుకు మొబైల్ ఫోన్ కొనిచ్చారు అత‌ని త‌ల్లిదండ్రులు. అత‌ను ఆన్ లైన్ క్లాసులు విన‌కుండా.. అశ్లీల చిత్రాలు చూడ‌టం మొద‌లు పెట్టాడు. 

ఈ క్ర‌మంలో అత‌నితో పాటు మ‌రో విద్యార్థి క‌లిసి.. బాలిక‌కు అశ్లీల చిత్రాలు చూపించారు. దీంతో ఆమె భ‌య‌ప‌డి త‌న ఇంట్లోకి పారిపోయింది. ఆ త‌ర్వాత బాలిక ఇంట్లోకి వెళ్లి త‌మ ఇంట్లోకి లాక్కొచ్చారు. బ‌ల‌వంతంగా ఆమెపై అత్యాచారం చేశారు. మ‌రో రోజు ఇంకో స్నేహితుడిని పిలిపించి.. ముగ్గురు క‌లిసి అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. వీరంతా ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్తే చంపేస్తామ‌ని చిన్నారిని బెదిరించారు.

అయిటే ఇటీవ‌లే బాలిక‌కు తీవ్ర‌మైన క‌డుపు నొప్పి వ‌చ్చింది. దీంతో తండ్రి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అత్యాచారానికి గురైన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. జ‌రిగిన విష‌యాన్ని బాలిక తండ్రికి చెప్పింది. 

తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రొక‌రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


logo