Crime
- Oct 25, 2020 , 14:52:37
కూలిన గార్మెంట్ డైయింగ్ భవనం.. ముగ్గురికి గాయాలు

చండీగఢ్: వస్త్ర రంగు కర్మాగార భవనం కూలిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పంజాబ్‌లోని లుధియానాలో ఈ ఘటన జరిగింది. స్థానిక గీతా కాలనీలోని గార్మెంట్ డైయింగ్ కర్మాగారంలో ఆదివారం పేలుడు జరింది. దీంతో ఆ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. పేలుడు ధాటికి గార్మెంట్ డైయింగ్ కర్మాగార భవనం కూలినట్లు ఏఎస్ఐ దల్జిత్ సింగ్ తెలిపారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, వారి పరిస్థితి బాగానే ఉన్నదని చెప్పారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన తర్వాతే పేలుడుకు కారణం ఏమిటన్నది అంచనా వేయగలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్‌లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
MOST READ
TRENDING