శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 17:26:26

డ్రైనేజీ కాల్వలో ముగ్గురు గల్లంతు

డ్రైనేజీ కాల్వలో ముగ్గురు గల్లంతు

ముంబై : ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శాంటాక్రూజ్‌ త్రిమూర్తి చాల్‌ ప్రాంతంలో మంగళవారం భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ పైకప్పు, పైఅంతస్తు కుప్పకూలి డ్రైనేజీ కాల్వలో పడి ముగ్గురు మహిళలు గల్లంతైనట్లు ముంబై బ్రిగేడ్‌ ముఖ్య అగ్నిమాపక అధికారి(సీఫ్‌ఓ) ప్రభాత్ ఎస్.రహంగ్‌డేల్ తెలిపారు. ఉదయం 11:30 గంటలకు ఈ ఘటన జరగ్గా స్థానికులు తమకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోగా డ్రైనేజీ కాల్వలో కొట్టుకుపోతున్న బాలికను పోలీసులు రక్షించి వీఎన్ దేశాయ్ దవాఖానకు తరలించారు. ముగ్గురు మహిళల ఆచూకీ లభించడం లేదని, సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని సీఎఫ్ఓ తెలిపారు. సోమవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంబై నగరంతోపాటు శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరో 48 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

logo