నిర్భయ ఘటనను తలపించేలా సామూహిక లైంగిక దాడి

రాంచీ: ఢిల్లీ నిర్భయ ఘటనను తలపించేలా ఓ మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం చత్రాలోని హంటర్గంజ్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. గురువారం రాత్రి బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన 50 ఏండ్ల వితంతు మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ బాగాల్లోకి గ్లాసు చొప్పించి దారుణంగా హింసించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.
కాగా ఆ మహిళ కోసం వెతికిన బంధువులు రక్తం మడుగులో ఉన్న ఆమెను గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బీహార్ రాష్ట్రం గయాలోని అనుగ్రా నారాయణ మగధ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని, ఆమె ప్రాణాలతో పోరాడుతున్నదని వైద్యులు తెలిపారు. కాగా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేసు విచారణ త్వరగా జరిగి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని ఎస్పీ రిషబ్ ఝా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- సముద్రంలో పడవ.. చెలరేగిన మంటలు
- షిరిడీకి వెళ్దామని చెప్పి.. స్వామీజీ కిడ్నాప్
- చైనా ఉపసంహరిస్తేనే.. మన దళాలను తగ్గిస్తాం : రాజ్నాథ్
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో